News November 5, 2024

2024 US elections: పోలింగ్ ప్రారంభం

image

అమెరికా 47వ అధ్య‌క్ష ఎన్నిక‌కు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్ప‌టికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్‌, బ్లూ స్టేట్స్‌లో పెద్ద‌గా హడావుడి లేక‌పోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెల‌కొంది. డెమోక్రాట్ల నుంచి క‌మ‌ల‌, ఆమె ర‌న్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్‌, రిప‌బ్లిక‌న్ల నుంచి ట్రంప్‌, ఆయ‌న ర‌న్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బ‌రిలో ఉన్నారు.

Similar News

News December 2, 2024

‘ది సబర్మతి రిపోర్ట్’ వీక్షించనున్న మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను వీక్షించనున్నారు. పార్లమెంట్ హాల్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. గోద్రా అల్లర్ల ఘటన కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు.

News December 2, 2024

ఇళ్ల ధరల్లో పెరుగుదల ఇలా!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో గతేడాది నుంచి జరిగిన హెచ్చుతగ్గులను TNIE నివేదించింది. హౌసింగ్ ధరలు చదరపు గజానికి సగటున రూ.11వేలు ఉన్నట్లు తేలింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణే, ముంబైలలో 2023 Q3 నుంచి 2024 Q4 వరకు ఇళ్ల ధరలను పరిశీలించారు. HYDలో స్క్వేర్ ఫీట్‌కు రూ.11,040 నుంచి ఇప్పుడు రూ.11,351కి పెరిగింది. ఇక్కడ 3శాతం వృద్ధిరేటు కనిపించింది.

News December 2, 2024

నేడే ‘సైబర్ మండే’.. అంటే ఏమిటి?

image

ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.