News November 18, 2024

APSRTCలో 2,064 ఖాళీలు: మంత్రి మండిపల్లి

image

APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.

Similar News

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.