News November 18, 2024

APSRTCలో 2,064 ఖాళీలు: మంత్రి మండిపల్లి

image

APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.

Similar News

News December 4, 2024

చై-శోభిత పెళ్లికి తరలివచ్చిన సెలబ్రిటీలు

image

అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య-శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రానా, అడవి శేష్, కీరవాణి, టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్, సుహాసిని, అశోక్ గల్లా, చందూ మొండేటి తదితరులు హాజరయ్యారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.

News December 4, 2024

బుర్రా వెంకటేశం వీఆర్ఎస్‌కు ఆమోదం

image

TG: ఐఏఎస్ బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను ఇటీవల టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రేపు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

News December 4, 2024

UPI పేమెంట్స్ చేసేవారికి గుడ్‌న్యూస్

image

UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు RBI ప్రకటించింది. ఒక్కో లావాదేవీ పరిమితిని కూడా రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే UPI పేమెంట్స్ చేయొచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకునేందుకు ముందుగా వాలెట్‌లో బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి.