News December 26, 2024

2030 నాటికి 20K మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి: భట్టి

image

TG: హరిత ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించినట్లు Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. దీనిపై జనవరి 3న HICCలో వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వల్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 2034-35 నాటికి 31,809 మెగా వాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

Similar News

News January 22, 2025

పీవీ సింధు పరాజయం

image

ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. వుమెన్స్ సింగిల్స్‌లో వియత్నాం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-22, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. అంతకుముందు ఇండియా ఓపెన్‌లోనూ సింధు ఓడిపోయారు.

News January 22, 2025

శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు

image

AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.

News January 22, 2025

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. MSP పెంపు

image

జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.