News August 1, 2024
20K to 25K: నిఫ్టీకి ప్రాణం పోసిన 10 స్టాక్స్

గత సెప్టెంబర్లో 20K నుంచి ఇప్పుడు 25K మైలురాయిని (25%) తాకేందుకు నిఫ్టీ50 సూచీ 220 సెషన్లే తీసుకుంది. ఈ 5వేల పాయింట్ల ర్యాలీలో 10 స్టాక్సే 50% మేర కంట్రిబ్యూట్ చేశాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కలిపి 8%, TCS, SBI, ONGC, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, NTPC, M&M, ఇన్ఫోసిస్ కలిపి 38.6% కంట్రిబ్యూట్ చేశాయి. ఈ వ్యవధిలో ఈ కంపెనీల MCap రూ.23.29 లక్షల కోట్లు పెరిగింది. మరో 36 కంపెనీలు 1-3% పెరిగాయి.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<


