News February 18, 2025

పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in

Similar News

News October 17, 2025

అన్నింటా రాణిస్తున్న అతివలు

image

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్​లోని జాతీయ పోలీస్​ అకాడమీలో 77వ రెగ్యులర్​ రిక్రూట్​ బ్యాచ్​లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్​ పోలీస్​ సర్వీస్​ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్‌లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.

News October 17, 2025

23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

image

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్‌కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

News October 17, 2025

తడిలో చేతిపై ముడతలు.. ఇందుకేనట!

image

నీటిలో కొద్దిసేపు ఉండగానే చేతులు, పాదాలపై ముడతలు ఏర్పడటం చూస్తుంటాం. ఈ ప్రక్రియను ఓస్మోటిక్ వ్యాప్తి అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిలో ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు. ‘శరీరంలోని అటానమిక్ నెర్వస్ సిస్టమ్ రక్త నాళాలను సంకోచింపజేయడం ద్వారా ముడతలు ఏర్పరుస్తుంది. ఆదిమానవులు తడి వాతావరణంలో ఆహారం సేకరించేందుకు ఇవి ఉపయోగపడేవి’ అని అభిప్రాయపడ్డారు.