News August 15, 2024
22 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్
AP: డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3లోపు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.
Similar News
News September 15, 2024
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.
News September 15, 2024
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు
TG: ఎల్లుండి వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా HYDలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకొని నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
News September 15, 2024
వరద బాధితులకు భారీ విరాళం
AP: రాష్ట్రంలో వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రూ.7.70 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెక్కు అందజేసినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తెలిపారు. వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చామన్నారు.