News April 19, 2024

తొలి రోజు APలో 229, TGలో 42 నామినేషన్లు

image

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ నుంచి 42 మంది ఎంపీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి తమ నామినేషన్ దాఖలు చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 19, 2024

KCR 10 ఏళ్ల పాలన అద్భుతం: హరీశ్ రావు

image

TG: KCR అంటే చరిత్ర అని, పదేళ్లు అద్భుతంగా పాలించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కేసీఆర్ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. కేశవ చంద్ర రమావత్ (KCR) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.

News November 19, 2024

హైరింగ్ ప్రాసెస్‌లో ఏజ్, జెండర్, పెళ్లి వివరాలు అడగొద్దు: ఫాక్స్‌కాన్

image

ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఏజ్, జెండర్, మారిటల్ స్టేటస్, కంపెనీ పేరు తొలగించాలని రిక్రూటింగ్ ఏజెంట్లను ఫాక్స్‌కాన్ ఆదేశించినట్టు తెలిసింది. యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. AC వర్క్‌ప్లేస్, ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్, క్యాంటీన్, ఫ్రీ హాస్టల్ వంటివి పెట్టాలని చెప్పింది. శ్రీపెరంబదూర్‌లోని ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో ఉద్యోగుల ఎంపిక కోసం థర్డ్‌పార్టీ ఏజెన్సీలను కంపెనీ నియమించుకుంది.

News November 18, 2024

ఢిల్లీలో 12వ తరగతి వరకు ప్రత్యక్ష క్లాసులు బంద్

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతులకు ఫిజికల్ క్లాసెస్ నిలిపివేస్తున్నామని, ఇక నుంచి ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని సీఎం అతిశీ వెల్లడించారు. ఇప్పటికే 9వ తరగతి వరకు క్లాసులను నిలిపివేశారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 493గా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప గాలి నాణ్యత అని అధికారులు చెప్పారు.