News April 19, 2024
తొలి రోజు APలో 229, TGలో 42 నామినేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ నుంచి 42 మంది ఎంపీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి తమ నామినేషన్ దాఖలు చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 19, 2024
జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?
జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. NDAకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏ మాత్రం సరిపోదు. అదనంగా సభ్యుల మద్దతు కూడగడితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌సభలో NDAకు 293 మంది సభ్యుల బలం ఉంటే, సవరణల ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే, అదనంగా 43 మంది సభ్యుల బలం అవసరం ఉంది.
News September 19, 2024
జమిలి ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు
లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, 83(2) *అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172 (1) *రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324 *లోక్‌సభ, అసెంబ్లీల ముందస్తు రద్దుకు రాష్ట్రపతి, గవర్నర్‌కు అధికారం కల్పించే ఆర్టికల్ 83(2), 172(1)ను సవరించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్పా జమిలి ఎన్నికలు సాధ్యం కావు.
News September 19, 2024
CM రేవంత్‌కి రైతులంటే ఎందుకింత భయం: KTR
రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడాన్ని KTR ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ‘ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయం? ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు’ అని ట్వీట్ చేశారు.