News December 29, 2024
ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు: డీజీపీ
TG: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 9.87% కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన వెల్లడించారు. రూ.142.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఒకటి, రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2025
విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM
TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.
News January 1, 2025
నిన్న భారీగా కండోమ్ అమ్మకాలు!
ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘స్విగ్గీ ఇన్స్టామార్ట్’లో నిన్న భారీగా కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ వచ్చినట్లు సంస్థ పేర్కొంది. నిన్న సాయంత్రం 5.30 వరకే 4779 కండోమ్స్ బుక్ అయినట్లు తెలిపింది. వీటితోపాటు రాత్రి 7.30 వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు అమ్ముడయ్యాయంది. అయితే, నిన్న రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి 8లో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవేనని, ఇది మదర్స్ డే, వాలెంటైన్స్ డేను అధిగమించిందని తెలిపింది.
News January 1, 2025
BGT: పుజారాను సెలక్టర్లే వద్దన్నారా?
BGTలో సీనియర్ బ్యాటర్ పుజారాను ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కానీ ఆయన ప్రతిపాదనను సెలక్టర్లు తిరస్కరించారని పేర్కొన్నాయి. నాలుగో టెస్టులో ఓటమి అనంతరం ఆటగాళ్లపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, పరిస్థితులకు తగ్గట్లు ఆడట్లేదని ఆగ్రహించినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా AUSలో 11 మ్యాచులు ఆడిన పుజారా 47.28 AVGతో 993 రన్స్ చేశారు.