News March 10, 2025
2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.
Similar News
News November 20, 2025
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
News November 20, 2025
మరోసారి KTRను విచారించనున్న ఈడీ?

TG: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో KTRను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ అనుమతి తీసుకోనుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్ను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే.
News November 20, 2025
న్యూస్ అప్డేట్స్

✦ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
✦ బీజేపీలో నాకు ఎవరితోనూ విభేదాలు లేవు: బండి సంజయ్
✦ దానం నాగేందర్, కడియంకి మరోసారి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
✦ టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. HYDలోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు
✦ అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజం: ఈటల


