News March 10, 2025
2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.
Similar News
News July 6, 2025
ఫార్మాసూటికల్స్‌లో అపార అవకాశాలు: మోదీ

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.
News July 6, 2025
జులై 6: చరిత్రలో ఈరోజు

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.