News May 22, 2024
24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్ స్టూడెంట్స్‌కి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం ఇంటర్‌లో 3,46,393 మంది, సెకండియర్‌లో 1,21,545 మంది విద్యార్థులున్నారు. వివరాలకు 08645-277702, 18004251531 నంబర్లలో సంప్రదించవచ్చు. పరీక్షల టైం టేబుల్‌ను పైఫొటోలో చూడొచ్చు.
Similar News
News March 13, 2026
RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
News March 13, 2026
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News March 13, 2026
ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT


