News May 21, 2024
24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
AP: ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News December 5, 2024
ఖజానాను ఖాళీ చేసిన జగన్: యనమల
AP: ప్రజా సమస్యలపై మాజీ సీఎం జగన్ <<14789250>>ఆందోళనలకు<<>> పిలుపునివ్వడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ ప్రస్తుతం అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
News December 5, 2024
KL-జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు: రోహిత్ శర్మ
రేపటి నుంచి జరిగే అడిలైడ్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ వెల్లడించారు. తొలి టెస్టులో జైస్వాల్‌తో కలిసి KL నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్‌కు అర్హుడని చెప్పారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు కష్టమైనా జట్టుకు మంచి చేస్తుందన్నారు.
News December 5, 2024
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణ
AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.