News March 17, 2024
జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ చందనా దీప్తి
నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 10, 2024
పుష్ప-2లో అల్లు అర్జున్ షర్ట్ మన పోచంపల్లిదే..
ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్నిచోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్ ఆఫీసర్ బన్వర్‌సింగ్ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివ..’ అని చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించినది పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు.
News December 10, 2024
NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ
ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
News December 10, 2024
NLG: అప్రెంటిస్ షిప్‌లో దరఖాస్తుల ఆహ్వానం
బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి మూడేళ్లపాటు ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.