News April 14, 2026
25 మంది సీఐల బదిలీ

రాయలసీమ జోన్ పరిధిలో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 15 మంది అధికారులకు స్థానచలనం కలిగింది. వెయిటింగ్‌లో ఉన్న ఇద్దరు సీఐలకు కొత్త పోస్టింగులు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బదిలీ అయిన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.
Similar News
News April 15, 2026
ములుగు: యాసంగి వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఇవే!

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాలను (FAQ) వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం మించరాదని, వ్యర్థ పదార్థాలు 1%, రంగు మారిన మొలకెత్తిన గింజలు 4%, పక్వానికి రాని గింజలు 3%, బెరుకు గింజలు 6% మించొద్దని సూచించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,369, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు.
News April 15, 2026
SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.
News April 15, 2026
న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్‌లైన్ కాల్‌కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


