News October 5, 2025
ECGCలో 25 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 5) ఆఖరు తేదీ. వయసు 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా www.nats.education.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://main.ecgc.in/
Similar News
News October 5, 2025
ఒకప్పటి హీరోహీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

చెన్నైలో జరిగిన 80వ దశకం సినీ తారల రీయూనియన్లో స్టార్ నటీనటులు పాల్గొన్నారు. ఆనాటి హీరోలు, హీరోయిన్లంతా స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో మెరిశారు. ఆరుపదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి Xలో షేర్ చేశారు. ‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులను కలిసినప్పుడల్లా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ప్రతి సమావేశం మొదటిదానిలానే కొత్తగా అనిపిస్తుంది’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
News October 5, 2025
వంటింటి చిట్కాలు

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్‌ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్‌లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 5, 2025
కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు?

ఆహ్లాదకర వాతావరణంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేయగా, ఆ మధుర నాదానికి పరవశించి నెమళ్లు ఆయన చుట్టూ చేరాయి. కృష్ణుడు నాట్యం చేస్తుండగా అవి ఆయన అడుగుల లయను అనుసరించాయి. పురివిప్పి నృత్యం చేయడం నేర్చుకున్నాయి. అలా కృష్ణుడు వాటికి గురువయ్యాడు. నెమళ్లు గురుదక్షిణగా పింఛాన్ని సమర్పించాయి. ఆ పింఛాన్ని ధరించిన కృష్ణుడు తన రూపాన్ని మరింత శోభాయమానం చేసుకున్నాడు. <<-se>>#DharmaSandehalu<<>>