News September 25, 2024

నేడు అకౌంట్లలోకి రూ.25 వేలు

image

AP: వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. NTR జిల్లా కలెక్టరేట్‌లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.

Similar News

News October 5, 2024

14 నుంచి ఏపీలో ‘పల్లె పండుగ’

image

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ‘పల్లె పండుగ’ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.

News October 5, 2024

బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహన సేవ ఉంటుంది.

News October 5, 2024

GOOD NEWS: నేడు అకౌంట్లలోకి రూ.2,000

image

దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీం కింద ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో రూ.6వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.