News October 19, 2024

25,000 ఉద్యోగాలు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

image

వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఖాళీగా ఉన్న 25వేల ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రైల్వేలో ఉద్యోగం చేసి రిటైరైన 65 ఏళ్లలోపు వారిని నియమించుకోనుంది. రెండేళ్ల పాటు సేవలందించేందుకు గాను వీరిని విధుల్లోకి తీసుకోనుండగా, పనితీరును బట్టి ఆ తర్వాతా కొనసాగించనున్నారు. రిటైర్‌మెంట్‌లో ఆఖరిగా తీసుకున్న జీతం నుంచి బేసిక్ పెన్షన్ డబ్బులను మినహాయించి శాలరీ ఇస్తారు.

Similar News

News November 5, 2024

కరీనా ‘దైరా’ చిత్రంలో పృథ్వీరాజ్?

image

మేఘనా గుల్జార్ డైరెక్షన్‌లో కరీనా కపూర్ నటిస్తున్న ‘దైరా’ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కాల్‌షీట్లు లేకపోవడంతో ఈ చిత్రం నుంచి ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా తప్పుకున్నారు.

News November 5, 2024

టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25, రూ.200 జరిమానాతో DEC 3, రూ.500 చెల్లింపుతో DEC 10 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. వృత్తి విద్య విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

News November 5, 2024

నిద్ర లేవగానే ఇలా చేస్తే..

image

ఉదయం నిద్ర లేవగానే 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసు ప్రశాంతంగా ఉంచడంతో పాటు రోజంతా మీరు సమర్థంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ధ్యానం మీ అంతర్గత శక్తిని పెంచుతుంది. సానుకూల ఫలితాల వైపు పయనించేలా చేస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో కాసేపు వర్కౌట్స్ చేస్తే కొవ్వు కరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.