News September 16, 2024

గణేశ్ లడ్డూకు వేలంపాటలో రూ.26లక్షలు

image

AP: విజయవాడ సమీపంలోని నున్న గ్రామంలో శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో గణేశ్ లడ్డూకు రికార్డు ధర పలికింది. సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేలంపాటలో లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ డబ్బును అపార్ట్‌మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేశ్ లడ్డూ <<14109980>>రూ.29 లక్షలు<<>> పలికిన విషయం తెలిసిందే.

Similar News

News October 7, 2024

ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News October 7, 2024

మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి

image

మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

News October 7, 2024

అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు

image

1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1900: తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం
1940: పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం
1979: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం