News August 6, 2024
హసీనాను పదవి నుంచి దింపిన 26 ఏళ్ల కుర్రాడు!

బంగ్లాదేశ్‌లో నహీద్ ఇస్లామ్ అనే యువకుడు పీఎం షేక్ హసీనా పదవి కోల్పోయేటట్లు చేశాడు. తోటి ఉద్యమకారులతో కలిసి ఆయన రిజర్వేషన్లపై పోరాడాడు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను నుదిటికి కప్పుకుని ఉద్యమాల్లో పాల్గొనేవాడు. భారీ ఆందోళనలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. కాగా 26 ఏళ్ల నహీద్ ఢాకాలో జన్మించాడు. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ విద్యార్థి. ఆయన తండ్రి ఓ టీచర్. ఆయన తమ్ముడు నఖీబ్ కూడా ఉద్యమకారుడే.
Similar News
News February 11, 2025
అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.
News February 11, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)
News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.