News January 22, 2025

27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

image

ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.

Similar News

News February 15, 2025

కేసీఆర్‌కు పట్టిన గతి రేవంత్‌కు పడుతుంది: ఎంపీ లక్ష్మణ్

image

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం <<15461493>>రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై<<>> బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఇంటికి వెళ్లారని దుయ్యబట్టారు. రేవంత్‌కు కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.

News February 15, 2025

ఈనెల 26న ‘ఓయ్’ రీరిలీజ్

image

సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఓయ్’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈనెల 26న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంతో పాటు మాస్ మహారాజా రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా కూడా రీరిలీజ్ కానుంది. ఏ సినిమాకు వెళ్తున్నారు? COMMENT

News February 15, 2025

పెన్సిల్ ఎత్తినా వర్కౌట్‌లా ఉంటుంది.. సునీత, విల్మోర్‌కు ఇబ్బందులు

image

సుమారు 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు వచ్చేనెల భూమిపైకి రానున్నారు. అయితే జీరో గ్రావిటీ ఉండే స్పేస్‌ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూమిపైకి వచ్చాక వారికి అనేక ఇబ్బందులు ఎదురవనున్నాయి. చిన్న పెన్సిల్ ఎత్తినా అది వర్కౌట్‌తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టంగా ఉంటుందని సునీత చెప్పారు.

error: Content is protected !!