News November 30, 2024
పడవ బోల్తా.. ఇప్పటికే 27 మంది మృతి

నైజీరియాలోని నైజర్ నదిలో <<14745791>>పడవ బోల్తా<<>> పడిన ఘటనలో 27 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పడవలో సుమారు 200 మంది ఉన్నట్లు తెలుస్తుండగా ఇంకా 100 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. కోగి రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రమైన నైజర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ బృందం గల్లంతైన వారికోసం గాలింపు చేస్తోంది.
Similar News
News March 17, 2026
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News March 17, 2026
ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.


