News August 6, 2024
హసీనా అసిస్టెంట్ పేరిట రూ.284 కోట్లు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అసిస్టెంట్ జహంగీర్ ఆలమ్ పేరిట రూ.284 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూఎస్లో నివసిస్తున్నట్లు సమాచారం. హసీనా ఆస్తుల విలువ రూ.3.14 కోట్లు కాగా, ఆమె అసిస్టెంట్ ఆస్తుల విలువ రూ.284 కోట్లు ఉండటం బంగ్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా తనకు ఆరెకరాల భూమి ఉందని, అందులో పండే పంటల ద్వారా ఆదాయం వస్తుందని హసీనా గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
శరీరంలో ఒత్తిడి ఎక్కువైతే కనిపించే లక్షణాలివే..

శరీరంలో ఒత్తిడి పెరిగినపుడు కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీంతో బీపీ, షుగర్, జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మన శరీరం తెలిపే లక్షణాలను గమనించాలంటున్నారు నిపుణులు. కార్టిసాల్ ఎక్కువైతే నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. ఎప్పుడూ నీరసం, అలసట, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. అలాగే ఆలోచనా శక్తితో పాటు మెదడు పనితీరు కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.
News January 3, 2026
కార్టిసాల్ హార్మోన్ పెరిగితే..

కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ అనారోగ్యాల బారిన పడుతుంది. హైబీపీ, గుండె జబ్బులు వస్తాయి. జీవన విధానంలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు, బెర్రీలు, నారింజ, జామ, గుడ్లు, చేప, చికెన్ వంటివి చేర్చుకోవాలి.
News January 3, 2026
ప్యూరిఫైయర్లపై GST కట్? సామాన్యులకు భారీ ఊరట!

వాయు కాలుష్యం, కలుషిత నీటి సమస్యల తీవ్రత నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18% పన్ను ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ధరలు తగ్గి సామాన్యులకు ఇవి మరింత అందుబాటులోకి వస్తాయి. రాబోయే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీటిని ‘లగ్జరీ’ కేటగిరీ నుంచి ‘అవసరమైన’ వస్తువులుగా గుర్తించనున్నారు.


