News August 6, 2024

హసీనా అసిస్టెంట్‌ పేరిట రూ.284 కోట్లు?

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అసిస్టెంట్ జహంగీర్ ఆలమ్ పేరిట రూ.284 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. హసీనా ఆస్తుల విలువ రూ.3.14 కోట్లు కాగా, ఆమె అసిస్టెంట్ ఆస్తుల విలువ రూ.284 కోట్లు ఉండటం బంగ్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా తనకు ఆరెకరాల భూమి ఉందని, అందులో పండే పంటల ద్వారా ఆదాయం వస్తుందని హసీనా గత ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

ఆ విష‌యంలో మాది కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రే: పాక్‌ మంత్రి

image

JKలో ఆర్టికల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో తాము కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రితోనే ఉన్నామంటూ పాక్ రక్ష‌ణ మంత్రి ఖ‌వాజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. JKలో కూట‌మి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆర్టిక‌ల్ 370, 35A పున‌రుద్ధ‌ర‌ణ‌లో వారిది, తమది ఒకే వైఖ‌రి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్క‌డా ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌రిస్తామ‌ని చెప్ప‌లేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తుండడం గమనార్హం.

News September 19, 2024

ALERT: గోధుమ పిండి వాడుతున్నారా?

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్‌లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.

News September 19, 2024

యువ CA మృతిపై కేంద్రం విచారణ

image

ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.