News May 1, 2024

2జీ స్కామ్.. కాగ్ అంచనా కంటే ఎక్కువే: దువ్వూరి

image

2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కామ్ విలువ రూ.1.76లక్షల కోట్లని CAG అంచనా వేసినా వాస్తవానికి ఆ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లో స్పెక్ట్రమ్ ప్రైసింగ్‌లో వచ్చిన లాభాలను కాగ్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మరోవైపు 2008లో 2జీ లైసెన్స్‌ల కేటాయింపులు కూడా 2001లో నిర్ణయించిన ధరలకే నాటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

Similar News

News March 10, 2026

గ్యాస్ కొరత‌.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

image

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్‌కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.

News March 10, 2026

రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

image

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.