News November 24, 2024
క్వింటన్ డికాక్‌కు రూ.3.60కోట్లు
వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను KKR రూ.3.60కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం ముంబై, KKR, SRH పోటీ పడ్డాయి. గత సీజన్లో లక్నో తరఫున ఆడిన ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చారు. డికాక్ ఐపీఎల్ కెరీర్లో 107 మ్యాచులు ఆడి 3157 రన్స్ చేశారు. ఇతడి స్ట్రైక్ రేట్ 134గా ఉంది. డికాక్ వికెట్ కీపింగ్‌తో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడగలరు.
Similar News
News December 6, 2024
చర్మంపై ముడతలా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి
యూత్‌ఫుల్ స్కిన్ ప్రతి ఒక్కరి కోరిక. వయసు పెరగడం, వాతావరణ మార్పులతో చర్మం ముడతలు పడటం సహజం. ఇలా కావొద్దంటే అసంతృప్త కొవ్వులుండే అవకాడో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇక విటమిన్ E నిగారింపు పెంచుతుంది. బ్లూ, బ్లాక్, స్ట్రా బెర్రీస్‌లోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. ఒమేగా 3 దొరికే అవిసెలు, చేపలు, విటమిన్స్, మినరల్స్ లభించే ఆకుకూరలు తీసుకోవాలి.
News December 6, 2024
ఆ ఊరిలో 60 ఏళ్లుగా మొబైల్, టీవీ లేవు!
మొబైల్, టీవీ లేకుండా చాలామందికి రోజు గడవదు. కానీ అమెరికాలోని వెస్ట్‌వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే ఊరిలో 60 ఏళ్లుగా టీవీ, సెల్ ఫోన్లను వాడటం లేదు. అందుకో కారణం ఉంది. అంతరిక్ష రేడియో తరంగాల అధ్యయనం కోసం 1958లో ఓ టెలిస్కోప్‌ను ఇక్కడ ప్రారంభించారు. ఫోన్లు, టీవీలు సహా ఫ్రీక్వెన్సీ కలిగిన పరికరాల్ని వాడితే ఆ తరంగాల వల్ల అధ్యయనం దెబ్బతింటుంది. అన్నట్లు.. అక్కడి జనాభా 141మంది మాత్రమే!
News December 6, 2024
రికార్డు సృష్టించిన బుమ్రా
టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒకే ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆయన నిలిచారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.