News September 5, 2024

రష్యా-ఉక్రెయిన్ మధ్య 3 దేశాలు మధ్యవర్తిత్వం చేయొచ్చు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్, చైనా, బ్రెజిల్ కలిసి మధ్యవర్తిత్వం చేయొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ‘మా రెండు దేశాలు ఇస్తాంబుల్‌ చర్చల్లో ప్రాథమిక అంగీకారానికి వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ అంగీకారాన్ని ఆధారంగా చేసుకుని చర్చల్ని కొనసాగించవచ్చు’ అని ఆయన వివరించారు. BRICS కూటమి వ్యవస్థాపక సభ్యదేశాలుగా రష్యాతో పాటు భారత్, చైనా, బ్రెజిల్‌ ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2025

ఇందిరా భవన్‌కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్

image

ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్‌లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.

News January 15, 2025

హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

News January 15, 2025

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు?

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.