News December 6, 2024
తెలంగాణలో 3 ESI ఆస్పత్రులు
తెలంగాణలో 3 ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహాయమంత్రి శోభ కరంద్లాజే వెల్లడించారు. రామగుండం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 100 పడకలు, మహబూబ్‌నగర్‌లో 100 పడకలకు ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో రెండు ESI కార్పొరేషన్, మిగతావి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్నాయన్నారు.
Similar News
News January 14, 2025
స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్‌లోనే ఆయనకు బస ఏర్పాటు చేయగా ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
News January 14, 2025
సంక్రాంతి: పుణ్యకాలం సమయం ఇదే.. ఏం చేయాలంటే?
సంక్రాంతి రోజున స్నానం, దానం, పూజకు విశిష్ఠ స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని అభ్యంగ స్నానం చేయాలి. ఇవాళ పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శని దోషం ఉన్నవారు ఈ రోజున నువ్వులు దానం చేస్తే శనీశ్వరుడు శాంతిస్తాడని నమ్మకం. ఉ.9.03 గం. నుంచి ఉ.10.48 గం. వరకు పుణ్యకాలం ఉందని, ఈ సమయంలో పూజలు, దానం చేస్తే సూర్యభగవానుడు విశేష ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.
News January 14, 2025
గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM
TG: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించబోతున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. సింగపూర్‌లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటామని చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్‌లో ₹40,232 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.