News November 26, 2024

ఒకే నేరానికి 3 FIRలా?: హైకోర్టు ఆగ్రహం

image

TG: లగచర్ల ఘటనలో BRS నేత పట్నం నరేందర్‌రెడ్డిపై మూడు FIRలు నమోదుచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త FIR పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను ప్రశ్నించింది. ఫిర్యాదు రాసిన రైటర్, తేదీలు, నిందితుల పేర్లు, కంటెంట్ మాత్రం ఒకేలా ఉన్నాయని తెలిపింది. కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరమని వ్యాఖ్యానించింది. నరేందర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

Similar News

News December 11, 2024

తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 11, 2024

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

AP: పదో తరగతి పరీక్షల <>షెడ్యూల్‌ను <<>>మంత్రి లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకునేలా షెడ్యూల్ ఇచ్చామని, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

News December 11, 2024

రూల్స్ ప్రకారమే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు: కేంద్రం

image

IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్ల‌పై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ర‌ద్దు చేసే ఆలోచ‌న ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌద‌రీ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజ‌ర్ రూల్స్‌-2015 ప్ర‌కార‌మే Clerkage fee వ‌సూలు చేస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశార‌ని ప్ర‌శ్నిస్తే, ఆ వివ‌రాలు విడిగా త‌మ వ‌ద్ద లేవ‌ని బ‌దులిచ్చింది.