News March 21, 2024
టేకులపల్లిలో 3 మద్యం దుకాణాల లూటీ
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ఉన్న 3 మద్యం దుకాణాలు లూటీకి గురయ్యాయి. అధిక ధరకు మద్యం అమ్ముతున్నారనే కారణంతో ప్రజలు ఈ దుకాణాలను లూటీ చేశారు. 3 షాపుల యజమానులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన కస్టమర్లు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రూ.22 లక్షల విలువైన మద్యం మాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 10, 2024
నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు
TG: పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను BRS ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.
News September 10, 2024
ఆటో డ్రైవర్ నిజాయితీ.. డైమండ్ నెక్లెస్ తిరిగిచ్చాడు!
విలువైన వస్తువులు కోల్పోతే అవి దొరకడం కష్టమే. అయితే, హరియాణాలోని గురుగ్రామ్‌లో రూ.లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ఉన్న బ్యాగ్‌ను ఓ మహిళ ఆటోలో మరిచిపోయింది. అందులో విలువైన వస్తువులు కూడా ఉండటంతో మహిళ ఆందోళన చెందింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కొద్దిసేపటికే బ్యాగ్ మరిచిపోయారంటూ డ్రైవర్ ఇంటికి రావడంతో ఆ మహిళ ఖుషీ అయింది. డ్రైవర్ నిజాయితీని అభినందిస్తూ చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరలవుతోంది.
News September 10, 2024
త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి.. లైన్ క్లియర్?
AP: ఇటీవలే YCPకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు TDPలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోదరులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసిన ఆయన వరద సాయంగా రూ.50 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శిద్దా పార్టీలో చేరికపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.