News April 5, 2024

30% మందికి ఉద్యోగాలు రాలేదనడం అవాస్తవం: IIT బాంబే

image

IIT బాంబేలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 36శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాలేదనే వార్త నెట్టింట వైరలైంది. దీనిపై IIT బాంబే క్లారిటీ ఇచ్చింది. ‘30% పైగా IITB విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవం. 2022-23 సర్వే ప్రకారం కేవలం 6.1% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని తెలుపుతూ సర్వే ఫలితాలు పోస్ట్ చేసింది.

Similar News

News January 27, 2026

జనవరి 27: చరిత్రలో ఈరోజు

image

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం

News January 27, 2026

పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

image

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.

News January 27, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి