News April 5, 2024

30% మందికి ఉద్యోగాలు రాలేదనడం అవాస్తవం: IIT బాంబే

image

IIT బాంబేలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 36శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాలేదనే వార్త నెట్టింట వైరలైంది. దీనిపై IIT బాంబే క్లారిటీ ఇచ్చింది. ‘30% పైగా IITB విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవం. 2022-23 సర్వే ప్రకారం కేవలం 6.1% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని తెలుపుతూ సర్వే ఫలితాలు పోస్ట్ చేసింది.

Similar News

News January 17, 2025

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్

image

IND యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. UPకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీంతో వీరికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. తండ్రి 3 సార్లు ఎంపీగా గెలిచారు.

News January 17, 2025

BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు

image

AP: 14వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు’ అని పేర్కొన్నారు.

News January 17, 2025

ప్రకృతి విలయం నుంచి తేరుకునేందుకు దశాబ్దం!

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌‌లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల రూ.లక్షల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ద కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహాలు & ప్రకృతికి విస్తృతమైన నష్టం వాటిల్లింది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ, అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.