News October 8, 2025
CSIR-IMMTలో 30 పోస్టులు

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ 30 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. వీటిలో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.immt.res.in/
Similar News
News October 8, 2025
బీసీ రిజర్వేషన్లు.. విచారణ వాయిదా

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై మధ్యాహ్నం 12.30కు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, తీర్పును చదివి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు.
News October 8, 2025
NCLTలో 32 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో 32 స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్రటరీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/
News October 8, 2025
చిన్న పిల్లలకు దిష్టి ఎందుకు తీస్తారు?

వేడుకలకు వెళ్లొచ్చిన తర్వాత పసుపు, సున్నం కలిపిన నీటితో చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు. దీని వెనుక సైన్స్ కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఫంక్షన్స్‌లో చుట్టాలు చిన్నపిల్లల చుట్టూ చేరుతారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. దిష్టి ద్వారా ఎరుపు నీటిని చూస్తే.. వారి మనసుకు ప్రశాంతత, ధైర్యం కలుగుతుందట. ఈ ఆచారం వారికి శుభాన్ని అందించి, హాయిగా నిద్రపోవడానికి తోడ్పడుతుందని నమ్మకం.