News March 6, 2025
ఏడాదిలో 30 సార్లు దుబాయ్‌కు.. ట్రిప్‌కు రూ.13 లక్షలు..!

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ DRI అధికారులకు దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఏడాదిగా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవధిలో ఆమె రూ.కోట్లు గడించినట్లు సమాచారం. ఒక్కో కిలోకు ఆమె రూ.లక్ష ఫీజు తీసుకునేది. ఒక్కో ట్రిప్‌కు దాదాపు రూ.13 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. గత 2 నెలల్లో 10 సార్లు అక్కడికి వెళ్లి వచ్చారు.
Similar News
News April 17, 2026
అహాన్, అనీత్.. మరో సినిమాకు ‘సై’యారా

బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై <<17590211>>బాక్సాఫీస్‌ను<<>> షేక్ చేసిన సినిమా ‘సైయారా’. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ జంట మరో రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమైంది. సైయారా తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సూరి, ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి, 2027లో మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.
News April 17, 2026
డీలిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా..

డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోదీని నిన్న లోక్‌సభలో పునరుద్ఘాటించారు. కేంద్రం లెక్కల ప్రకారం సౌత్ స్టేట్స్‌లో సీట్ల పెంపు ఇలా ఉంటుంది.
☞ ఏపీ 25 నుంచి 38కి, ☞ తెలంగాణ 17 నుంచి 26కు, ☞ తమిళనాడు 39 నుంచి 59కి, ☞ కర్ణాటక 28 నుంచి 42కు, ☞ కేరళం 20 నుంచి 30కి పెరగనున్నాయి. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న 129 ఎంపీ సీట్లు 195కి చేరతాయి.
News April 17, 2026
4 కులాల్లోనే 40శాతం మంది పేదలు!

TGలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ సర్వే బహిర్గతం చేసింది. రూ.లక్షలోపు వార్షికాదాయం కలిగిన 1.10కోట్ల మంది నిరుపేదల్లో 40% మంది మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవులేనని పేర్కొంది. విద్యాపరంగానూ అసమానతలు ఉన్నాయంది. కొన్ని కులాల్లో ఉన్నత విద్యావంతులు 35.37% ఉండగా మరికొన్ని కులాల్లో ఇది 5% లోపేనని తెలిపింది. మాదిగ, STల్లోనే అత్యధిక బాలకార్మికులు ఉన్నారని, వడ్డెరలో 55% మంది దినసరి కూలీలని చెప్పింది.


