News January 28, 2026

300 డివిజన్లలో ఆన్‌లైన్‌‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు

image

GHMCలో 27 ULBల విలీనంతో 300 డివిజన్లు, 60 సర్కిళ్లకు విస్తరించింది. బర్త్, డెత్ ధ్రువీకరణలను డిజిటల్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను అనుసంధానించి, వార్డు, సర్కిల్‌ మ్యాపింగ్‌తో కొత్త ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆస్పత్రి లేదా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రజలకు సేవలు త్వరితగతిన అందనున్నాయి.
#SHARE IT

Similar News

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.