News November 3, 2024

రోడ్లెక్కిన 30,000 మంది హిందువులు

image

తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌‌లో 30,000 మంది హిందువులు రోడ్లెక్కారు. రాజధాని ఢాకాలో భారీ సంఖ్యలో ర్యాలీలు చేపట్టారు. మైనారిటీల రక్షణకు చట్టం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, హిందూ సంఘాల నేతలపై దేశద్రోహం కేసుల ఎత్తివేత, తమకు ఓ ట్రిబ్యునల్‌ ఏర్పాటు వంటి డిమాండ్లు చేస్తున్నారు. ప్రధాని పదవి నుంచి హసీనాను దించాక తమపై హింస, బెదిరింపులు పెరిగాయని, రక్షణ కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News November 19, 2025

పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

News November 19, 2025

ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.

News November 18, 2025

జైల్లో మొహియుద్దీన్‌పై దాడి!

image

టెర్రర్ మాడ్యూల్‌ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.