News November 3, 2024
రోడ్లెక్కిన 30,000 మంది హిందువులు
తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో 30,000 మంది హిందువులు రోడ్లెక్కారు. రాజధాని ఢాకాలో భారీ సంఖ్యలో ర్యాలీలు చేపట్టారు. మైనారిటీల రక్షణకు చట్టం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, హిందూ సంఘాల నేతలపై దేశద్రోహం కేసుల ఎత్తివేత, తమకు ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి డిమాండ్లు చేస్తున్నారు. ప్రధాని పదవి నుంచి హసీనాను దించాక తమపై హింస, బెదిరింపులు పెరిగాయని, రక్షణ కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News December 14, 2024
గబ్బా టెస్టులో సారా టెండూల్కర్ సందడి
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సందడి చేశారు. స్టాండ్స్‌లో నుంచి భారత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా సారా సందడి చేసిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.
News December 14, 2024
అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!
జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.
News December 14, 2024
హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.