News December 18, 2024

ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలు: మంత్రి

image

TGSRTCలో కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో RTCలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామన్నారు.

Similar News

News November 23, 2025

జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.

News November 23, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/

News November 23, 2025

చలికాలంలో కర్లీ హెయిర్ ఇలా సంరక్షించండి

image

చలి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ముఖ్యంగా కర్లీ హెయిర్ త్వరగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. హెయిర్ సీరమ్, కండిషనర్లు, క్లెన్సర్‌లలో కాస్త తేనె కలిపి రాసుకోవడం, కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలతో మసాజ్ చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.