News December 18, 2024
ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలు: మంత్రి
TGSRTCలో కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో RTCలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామన్నారు.
Similar News
News January 13, 2025
యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్
మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.
News January 13, 2025
నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.
News January 13, 2025
కోహ్లీ రెస్టారెంట్: ఉడకబెట్టిన మొక్కజొన్న ధర ₹525
కోహ్లీ రెస్టారెంట్ చైన్ One8 Communeలో ధరలపై చర్చ నడుస్తోంది. ఉడకబెట్టిన ప్లేటు మొక్కజొన్న కంకులకు ₹525 ధర చెల్లించానని HYDకు చెందిన ఓ యువతి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీంతో కొందరు ఆమెకు మద్దతిస్తుంటే, ఇంకొందరు తప్పుబడుతున్నారు. బ్రాండ్ హోటల్స్‌లో ఉండే ఏంబియన్స్‌కు ఆ మాత్రం ధర ఉంటుందని ఒకరు, One8 కమ్యూనిటీ మొత్తానికీ చెల్లించారని మరొకరు కామెంట్ చేస్తున్నారు.