News December 31, 2024
31st నైట్: ఆగకుండా తింటూ తాగేస్తారా..!
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కలిసి 31st నైట్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అకేషన్ దొరికింది కదాని కొందరు అదే పనిగా మద్యం సేవిస్తుంటారు. మరికొందరేమో కూల్‌డ్రింక్స్‌ను తాగుతారు. తోడుగా వెజ్, నాన్‌వెజ్, ఫ్రైస్‌ను లాగించేస్తారు. గ్యాప్ లేకుండా తింటూ తాగడం వల్ల ఒబెసిటీ, హెడేక్స్, డయాబెటిస్, గ్యాస్ట్రో, పెయిన్, లివర్, మెదడు, నరాల రోగాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ అవసరమంటున్నారు.
Similar News
News January 13, 2025
నచ్చకపోతే కోహ్లీ అవకాశాలు ఇవ్వడు: ఉతప్ప
జట్టులో ఎవరైనా నచ్చకపోతే విరాట్ కోహ్లీ అవకాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్రపంచ కప్‌కి అంబటి రాయుడు ఎంపిక కాలేదని, కోహ్లీకి అతనంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వరల్డ్ కప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన తరువాత కూడా జట్టులోకి తీసుకోలేదన్నారు. ఒకర్ని ఇంటికి పిలిచి మొహం మీద తలుపులు వేయడం తగదని ఉతప్ప వ్యాఖ్యానించారు.
News January 13, 2025
‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు
‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News January 13, 2025
నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ
AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.