News January 27, 2025

32,438 ఉద్యోగాలు.. తెలుగులోనూ పరీక్ష

image

RRB చేపడుతున్న 32,438 లెవెల్-1 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 14 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుండగా అందరికీ ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తారు. AP, TGకి చెందిన అభ్యర్థులకు తెలుగులోనే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించారు. 100 మార్కులు గల పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మైనస్ మార్క్ ఉంటుంది. టెన్త్/ఐటీఐ/ఎన్‌సీవీటీ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు.
వెబ్‌సైట్: <>rrbapply.gov.in<<>>

Similar News

News February 18, 2025

విద్యార్థుల వద్ద కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవు

image

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.

News February 18, 2025

అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

image

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

image

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.

error: Content is protected !!