News December 27, 2024
రాజ్యసభలో 33 ఏళ్లు
మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991, 1995, 2001, 2007, 2013లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చివరగా 2019లో రాజస్థాన్ నుంచి పెద్దలకు సభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగిసింది. ఈయన 1999లో తొలిసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News January 16, 2025
ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు
దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్‌ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.
News January 16, 2025
చరిత్ర సృష్టించిన ప్రతిక
IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.
News January 16, 2025
సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN
AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.