News August 26, 2024

త్వరలో 35వేల ఉద్యోగాలు: CM రేవంత్

image

TG: రాష్ట్రంలోని నిరుద్యోగులకు CM రేవంత్ శుభవార్త చెప్పారు. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు తాను అన్నగా తోడుంటానని హామీ ఇచ్చారు. సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే మరోసారి ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే ఇబ్బందని, కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

Similar News

News September 18, 2024

జానీ మాస్టర్‌‌పై వేటు

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

News September 18, 2024

పాక్ క్రికెట్‌ను గాడిలో పెట్టే వ్యక్తులు కావాలి: లతీఫ్

image

పాకిస్థాన్ క్రికెట్ అంపశయ్య మీద ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు అత్యవసరమని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బాబర్ ఆజం మానసిక ఒత్తిడికి గురై ఆటలో రాణించలేకపోతున్నారని చెప్పారు. ఆయన కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టులో తొలిసారిగా బంగ్లా చేతిలో పాక్ క్లీన్‌స్వీప్‌కు గురికావడం ఆ జట్టు దుస్థితికి అద్దం పడుతోంది.

News September 18, 2024

IIT బాంబేకు మోతిలాల్ ఓస్వాల్ రూ.130 కోట్ల విరాళం

image

మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు రూ. 130 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనిని విద్యా సంస్థ‌లో ఆర్థిక రంగంలో ప‌రిశ్ర‌మ ఆధారిత వినూత్న కార్య‌క్ర‌మాల అమ‌లు, మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, పరిశోధనల మెరుగుకు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇది భారతీయ విద్యా సంస్థకు అందిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాలలో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా మోతిలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఐఐటీ బాంబేలో ఏర్పాటు చేయనున్నారు.