News June 6, 2024

ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి 350 ఏళ్లు

image

ఛత్రపతిగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లేకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మరాఠా సామ్రాజ్యానికి రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగింది ఈరోజేనంటూ ఆయన ఫాలోవర్స్ Xలో పోస్టులు పెడుతున్నారు. శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, ప్రజలందరినీ సమానంగా చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News December 29, 2025

ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

image

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

News December 29, 2025

‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్‌ప్రైజ్?

image

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.

News December 29, 2025

చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్‌, పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.