News June 6, 2024

ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి 350 ఏళ్లు

image

ఛత్రపతిగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లేకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మరాఠా సామ్రాజ్యానికి రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగింది ఈరోజేనంటూ ఆయన ఫాలోవర్స్ Xలో పోస్టులు పెడుతున్నారు. శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, ప్రజలందరినీ సమానంగా చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News July 8, 2025

ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

image

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.

News July 8, 2025

రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు

image

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని IMD తెలిపింది. దీనికి అనుగుణంగా ద్రోణి కూడా కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌వైపు కదులుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.

News July 8, 2025

మూడ్రోజుల్లో రైతులకు ధాన్యం కొనుగోలు నగదు: మార్క్‌ఫెడ్

image

AP: రైతులకు మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు శుభవార్త చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(NCDC) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం పొందేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి లభించింది. రుణం అందగానే ధాన్యం సేకరించిన పౌర సరఫరాల సంస్థకు నగదు బదిలీ చేస్తాం. తద్వారా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపులు వెనువెంటనే చేస్తుంది’ ఆయన పేర్కొన్నారు.