News March 26, 2024

ఆరోగ్యమైన గుండె కోసం రోజూ 3600 అడుగులు

image

సాధారణ వేగంతో రోజుకు 3600 అడుగులు వేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం 26శాతం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. బఫెలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసు గల 6వేల మంది అమెరికన్ మహిళలపై అధ్యయనం చేశారు. ఏడున్నర ఏళ్ల పాటు అధ్యయనంలో భాగంగా నడిచిన 407 మంది హార్ట్ పేషంట్స్‌లో గుండె ఆగిపోయే ప్రమాదం తక్కువగా ఉందని తెలిసింది.

Similar News

News April 4, 2026

ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం: CM

image

TG పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి 12th వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని CM రేవంత్ తెలిపారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని ఇబ్ర‌హీంప‌ట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.

News April 4, 2026

భారత్‌కు రావాల్సిన క్రూడాయిల్ చైనాకు.. ఎందుకంటే?

image

6లక్షల బ్యారెళ్ల ఇరాన్ క్రూడ్‌తో గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు రావాల్సిన నౌక లాస్ట్ మినట్‌లో చైనాకు మళ్లడం చర్చనీయాంశమైంది. పింగ్ షున్ అనే ఈ నౌక ఇప్పుడు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు ప్రయాణిస్తోంది. పేమెంట్ సమస్యే నౌక తిరిగివెళ్లిపోవడానికి ప్రధాన కారణం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయిల్ డిమాండ్ పెరగడంతో ఎర్లీ క్రెడిట్ విండో సిస్టమ్‌కు విక్రయదారులు సుముఖంగా లేరని తెలుస్తోంది.

News April 3, 2026

‘పంచాయత్’ సీజన్-5 షూటింగ్ షురూ

image

సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ సీజన్-5 షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సిరీస్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ మేరకు ఇన్‌స్టాలో ప్రకటించారు. MPలోని పులేరా గ్రామం చుట్టూ ఈ కథ సాగుతుంది. జితేంద్ర కుమార్, సాన్విక, చందన్ రాయ్, రఘువీర్, నీనా గుప్తా, ఫైజల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు IMDb రేటింగ్ 9/10గా ఉంది. ఈ సిరీస్‌లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి.