News November 11, 2024
3,712 ఉద్యోగాలు.. రేపే హాల్టికెట్ల విడుదల

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC రేపు విడుదల చేయనుంది. అభ్యర్థులు <
Similar News
News October 15, 2025
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.