News November 11, 2024

3,712 ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్ల విడుదల

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC రేపు విడుదల చేయనుంది. అభ్యర్థులు <>https://ssc.gov.in/<<>> వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,712 గ్రూప్-C ఉద్యోగాల(లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్)కు ఈ నెల 18న రెండు సెషన్లలో ఆన్‌లైన్ పరీక్ష జరగనుంది.

Similar News

News December 10, 2024

హమాస్ వినాశనమే మా లక్ష్యం: నెతన్యాహు

image

తాము యుద్ధం ముగిస్తే హమాస్ తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అందుకే తాము యుద్ధం విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి 14 నెలలు పూర్తైన సందర్భంగా నెతన్యాహు మాట్లాడారు. ‘యుద్ధాన్ని ఆపితే హమాస్ కోలుకుని మళ్లీ బలపడుతుంది. అందుకే దాని సైనిక, పరిపాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తా. భవిష్యత్‌లో మాపై దాడులు జరగకుండా చేస్తా. హమాస్ వినాశనమే మా టార్గెట్’ అని ఆయన పేర్కొన్నారు.

News December 10, 2024

అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు వస్తారు?

image

TG: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న తొలి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో ‘ఆయన ఇక ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారా? తమ పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కాలం గడిపేస్తారా?’ అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఈనెల 16 నుంచి కొనసాగే సమావేశాలకైనా ఆయన వస్తారేమో చూడాలి.

News December 10, 2024

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

image

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.