News April 5, 2025

రాష్ట్రంలో రూ.33,800 జీతంతో 390 ఉద్యోగాలు

image

TG: 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం వీరిని నియమించనుంది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు రూ.33,800 వేతనం ఉంటుంది. ఈనెల 11లోగా <>ఆన్‌లైన్‌లో దరఖాస్తు<<>> చేసుకోవాలి. సివిల్ ఇంజినీరింగ్ చేసి, 44yrsలోపు వారు అర్హులు.

Similar News

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.